Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిన్నటి వరకు అతడి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో.. రాత్రికి రాత్రే అతడి అకౌంట్లో రూ.2 కోట్లు.. ఈ అదృష్టవంతుడి కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: మూడో తరగతితోనే అతడి చదువుకు ఫుల్ స్టాప్ పడింది. ఉన్న ఊళ్లో పని దొరక్క గల్ఫ్‌కు ప్రయాణం కట్టాడు. పదేళ్లుగా అక్కడే ఉద్యోగం..చాలీచాలని జీతం..ఒడిదుడుకుల జీవితం. అతడి బ్యాంకు బ్యాలెన్సు సున్నా. అలాంటి వ్యక్తి జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. చూస్తుండగానే కోటీశ్వరుడైపోయాడు. అదృష్టం కలిసొస్తే జీవితం ఒక్కసారిగా ఎలా మారిపోతుందో తెలిపే ఘటన ఇది. 

బంగ్లాదేశ్‌కు చెందిన ఖాదిర్ గత పదేళ్లుగా దుబాయ్‌లోనే ఉంటున్నాడు. క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తనకొచ్చే కొద్ది పాటి జీతంలో తన ఖర్చులు పోను మిగతాదంతా బంగ్లాదేశ్‌లో ఉంటున్న తన భార్యాబిడ్డలకే పంపిస్తుంటాడు. అయితే..గల్ఫ్‌లో నివసించే ఇతర కార్మికుల వలెనే అతడు కూడా మహ్‌జూజ్ లాటరీలో పాల్గొంటుంటాడు. ఎప్పటికైనా తనను అదృష్టం వరిస్తుందని అతడికి గట్టి నమ్మకం.


అయితే ఖాదిర్ నమ్మకం శనివారం నిజమైంది. రాత్రికి రాత్రికి అతడు కోటీశ్వరుడైపోయాడు. 46వ వీక్లీ మహ్‌జూజ్ డ్రాలో అతడిని అదృష్టం వరించింది. లాటరీ నెంబర్‌లో ఆరు సంఖ్యలకు గాను తన నెంబర్‌లోని ఐదు సంఖ్యలు సరిపోలడంతో అతడు ఏకంగా 1 మిలియన్ దిర్హామ్లను(దాదాపు రూ. 2 కోట్లు) గెలుచుకోగలిగాడు. వాస్తవానికి డ్రా తీసే సమయానికి అతడి మొబైల్‌లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేదు. దీంతో.. ఇంటర్నెట్ వేగం తగ్గిపోయి అతడు డ్రాను లైవ్‌లో సరిగా చూడలేకపోయాడు. ఈ క్రమంలో ఖాదిర్ తన మిత్రుడికి ఫోన్ చేసి తన నెంబర్ వచ్చిందీ లేనిదీ చూసి పెట్టమన్నాడు. ఆ తరువాత.. గెలుపు అతడిని వరించినట్టు మిత్రుడు ఫోన్ చేసి చెప్పడంతో ఖాదిర్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

‘‘ఇన్నాళ్లకు నా కష్టాలకు తెరపడింది’’ అంటూ అతడు కన్నీళ్లను దిగమింగుతూ మీడియాతో వ్యాఖ్యానించాడు. ఈ డబ్బుతో మొదటగా తన భార్యకు ఇష్టమైన నగలు కొంటానని, ఇన్ని కష్టాల్లోనూ ఆమె తనకు తోడు నీడగా నిలిచిందని ఖాదిర్ తెలిపాడు. అంతేకాకుండా.. తన వలెనే కష్టాల్లో ఉన్న తోబుట్టువులను కూడా ఆదుకునేందుకు వారికి కొంత డబ్బు ఇచ్చేందుకూ  నిర్ణయించుకున్నాడు. ఇక భవిష్యత్తులో ఆర్థికభద్రత కోసం ఓ ఇల్లు కట్టి దాన్ని అద్దెకు ఇస్తానన్న అతడు.. దీని ద్వారా తన కుటుంబానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుందని తెలిపాడు. ఆర్థిక కష్టాల కారణంగా తన చదువు అర్థాంతరంగా ఆగిపోయిందని బాధపడ్డ ఖాదిర్.. ఈ లాటరీ కారణంగా తన పిల్లలకు తమ కలలను నిజం చేసుకునే అవకాశం చిక్కిందంటూ తెగ మురిసిపోయాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement