- 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
- 120 పరుగులతో విండీస్ ఓటమి
చిట్టగాంగ్: సొంతగడ్డపై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బంగ్లాదేశ్.. వెస్టిండీ్‌సతో మూడు వన్డేల సిరీ్‌సను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. సోమవారం జరిగిన ఆఖరి, మూడో వన్డేలో విండీ్‌సను 120 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (64), ముష్ఫికర్ రహీమ్ (64)తోపాటు మహ్మదుల్లా (64 నాటౌట్), షకీబల్ (51) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో బంగ్లా బౌలర్ల దెబ్బకు విండీస్ 44.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. రోవ్‌మెన్ పావెల్ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
షకీబల్ అరుదైన రికార్డు..: ఈ మ్యాచ్‌తో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబల్ అరుదైన ఘనతను అందుకొన్నాడు. ఒక దేశంలో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 6వేల పరుగులు, 300పైగా వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.