Abn logo
Jul 3 2020 @ 07:45AM

బెంగాల్ సరిహద్దుల్లో భారత దిగుమతులను అడ్డుకున్న బంగ్లాదేశ్ వ్యాపారులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో భారత దేశం నుంచి బంగ్లాదేశ్ కు వెళుతున్న దిగుమతుల ట్రక్కులను బంగ్లాదేశ్ వ్యాపారులు సరిహద్దుల్లో అడ్డుకున్నారు. తమ బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు దిగుమతులను అనుమతించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ వ్యాపారులు, వారి కార్మికులు నిరంతరం ఆందోళన చేస్తున్నారు. భారతదేశం తమ దిగుమతులను అనుమతించే వరకు తాము సరిహద్దును మూసి ఉంచుతామని బంగ్లాదేశ్ వ్యాపారులు ప్రకటించారు. భారతదేశం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయని ఈ విషయంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ జోక్యం చేసుకోవాలని  ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఇఓ) చైర్మన్ (తూర్పు) సుశీల్ పట్వారీ కోరారు. సరిహద్దుల్లో ట్రక్కులను నిలిపివేయడంతో తమ సరకులను ఉత్తరపరగణాలలోని చిన్న భూఓడరేవు అయిన గోజదంగాకు మళ్లించారు. ‘‘బంగ్లాదేశ్ లోని బెనపోల్‌లోకి ప్రవేశించడానికి మేము ఏ ట్రక్కును అనుమతించలేదు. భారతదేశం మా వస్తువుల దిగుమతిని తిరిగి ప్రారంభించే వరకు ఇది కొనసాగుతుంది’’ అని బెనాపోల్ సి అండ్ ఎఫ్ ఏజెంట్స్ స్టాఫ్ అసోసియేషన్ కార్యదర్శి సాజిదూర్ రెహ్మాన్ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement