Abn logo
Apr 23 2021 @ 01:03AM

బంగ్లాదేశ్‌ భారీస్కోరు

పల్లెకెలె: కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (127) శతకంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 302/2తో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన బంగ్లా వెలుతురులేమితో ఆట నిలిచిపోయేసరికి 4 వికెట్లకు 474 పరుగులు చేసింది. తొలిరోజు సెంచరీ హీరో నజ్ముల్‌ హుస్సేన్‌ (167)తో కలిసి మూడో వికెట్‌కు మోమినుల్‌ 242 రన్స్‌ జోడించాడు. క్రీజులో ముష్ఫికర్‌ (43), లిట్టన్‌ దాస్‌ (25) ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement