Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 17 2021 @ 18:25PM

బంగ్లాదేశ్‌లో Durga మండపాలపై దాడులు.. బంద్ పిలుపునిచ్చిన మైనార్టీలు

ఢాకా: బంగ్లాదేశ్‌లో దుర్గా మండపాలపై అక్కడి మెజారిటీ మతస్తులు దాడులు చేశారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా బంగ్లాదేశ్‌లోని మైనారిటీ మతస్తులైన హిందువులు దుర్గ మండపాలను ఏర్పాటు చేసి వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది గుర్తు తెలియని ముస్లిం వ్యక్తులు దుర్గా మండపాలపై దాడి చేసి పూజా సమాగ్రిని చిందరవందర చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు అక్కడి మైనారిటీ సమూహాలు పిలుపునిచ్చాయి.


బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెనిలో దుర్గా మండపంపై దాడి అనంతరం మెజారిటీ, మైనారిటీ సమూహాలకు మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో స్థానిక పోలీసు అధికారి సహా 40 మందికి గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలే దేశంలో పలుచోట్ల జరిగినట్లు అక్కడి స్థానిక పత్రిక ట్రైబ్యూన్ పేర్కొంది. ఘర్షణల కారణంగా దేశంలో పలు చోట్ల బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఫోర్స్‌ను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలు, దుర్గా మండపాలు ఉన్న ప్రాంతంలో భద్రతను పటిష్టం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement