ఏడు రోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం!

ABN , First Publish Date - 2021-08-05T12:12:03+05:30 IST

కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా ఆంక్షలను కొనసాగిస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

ఏడు రోజుల్లో కోటి మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం!

ఢాకా: కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా ఆంక్షలను కొనసాగిస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. మరోపక్క వారం రోజుల వ్యవధిలో కోటి మందికి వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఆగస్ట్ ఏడో తేదీ నుంచి వారం రోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మైదుల్ ఇస్లాం ప్రొదాన్ తెలిపారు. ఈ డ్రైవ్‌లో వయసు పైబడినవారు, కార్మికులు, దుకాణాదారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. చైనా, అమెరికాల నుంచి వ్యాక్సిన్లు దేశానికి రావడంతో ప్రస్తుతం కోటి 20 లక్షల మందికి సరిపడే స్టాక్ ఉన్నట్టు ఆయన చెప్పారు. కాగా.. బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. 21,160 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2021-08-05T12:12:03+05:30 IST