బంగ్లా లక్ష్యం 274.. ప్రస్తుతం 11/3

ABN , First Publish Date - 2022-04-04T09:48:35+05:30 IST

తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌కు దక్షిణాఫ్రికా 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

బంగ్లా లక్ష్యం 274.. ప్రస్తుతం 11/3

డర్బన్‌: తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌కు  దక్షిణాఫ్రికా 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దాంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన బంగ్లా నాలుగో రోజు ఆట ఆఖరికి 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్‌ స్కోరు 6/0తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలు 204 రన్స్‌కు ఆలౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 367, బంగ్లాదేశ్‌ 298 రన్స్‌ చేశాయి. 

Updated Date - 2022-04-04T09:48:35+05:30 IST