Abn logo
Jun 30 2020 @ 17:22PM

ఆకట్టుకుంటున్న `బంగారు బుల్లోడు` టీజర్!

వరుస పరాజయాలతో డీలా పడిన అల్లరి నరేష్ మళ్లీ జోరు పెంచాడు. `నాంది` వంటి విభిన్నమైన సినిమాతో పాటు తనకు అలవాటైన కామెడీ ఎంటర్‌టైన‌ర్‌తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ `బంగారు బుల్లోడు` టీజర్ తాజాగా బయటకు వచ్చింది. 


పల్లెటూరి వాతావరణంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. మునుపటి కామెడీ టైమింగ్‌తో అల్లరి నరేష్ ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతో టీజర్‌ను నింపేశారు. పూజా జవేరి ఈ సినిమాలో హీరోయిన్. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.గిరి దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు. 



Advertisement
Advertisement
Advertisement