Abn logo
Jan 19 2021 @ 20:20PM

ఈ ‘బంగారు బుల్లోడు’ లేడీస్‌కి బాగా కనెక్ట్ అవుతాడట

అల్లరి నరేష్, పూజా జవేరి హీరోహీరోయిన్లుగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం "బంగారు బుల్లోడు". జనవరి 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్‌ మంగళవారం చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. 


ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా జవేరి మాట్లాడుతూ.. ''వన్ ఇయర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ట్రైలర్ లాంచ్ లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఈ 23న మా బంగారు బుల్లోడు రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ. అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకు మరిన్ని లాభాలు రావాలి. సాయి కార్తీక్ తో థర్డ్ ఫిల్మ్ ఇది. మంచి సాంగ్స్ ఇచ్చారు. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ అంతా చాలా ఫన్నీగా, స్మూత్ గా జరిగింది. సినిమా చాలా బిగ్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌తో ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అనిల్, కిషోర్ గిరి గారికి నా థ్యాంక్స్.." అన్నారు.


సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ''ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో ఇది ఐదవ సినిమా. నరేష్‌తో 4వ సినిమా. ఇందులో మూడు సాంగ్స్ ఉన్నాయి. పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా స్వాతిలో ముత్యమంత పాట రీమిక్స్ చేశాం. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ పాట బాగా చేశాం. రీమిక్స్ అనేది ఇప్పటివరకు చెడగొట్టకుండా బాగా చేశాను. బయట కూడా అదే మంచి పేరు ఉంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని గిరి రూపొందించాడు. నా లక్కీ నంబర్ 5. ఈనెల 23న విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి మంచి పేరు రావాలి.." అన్నారు.


రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''నరేష్ గారితో చేసిన అన్నీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఒక ఫ్యామిలీ లో జరిగే కథ ఇది. అందులోనే కామెడీ ట్రావెల్ అవుతుంది. మరో కొత్త కోణంలో నరేష్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన కెరియర్‌లో ఈ చిత్రం బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. మేం సినిమా చూశాం. మేమందరం బాగా నవ్వుకుని ఎంజాయ్ చేశాం. అలాగే ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీలవుతారు. సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా ఈ చిత్రం లేడీస్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.." అన్నారు.


చిత్ర దర్శకుడు గిరి పాలిక మాట్లాడుతూ.. ''నందిని నర్సింగ్ హోమ్ చిత్రం తర్వాత చేసిన సినిమా ఇది. బెండు అప్పారావు తర్వాత పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో నరేష్ సినిమా చేయలేదు. అలాంటి సినిమా చేయాలని ఈ కథ రాయడం జరిగింది. కథలో క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూ ఈ సినిమా రన్ అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. సాయి కార్తీక్ మ్యూజిక్, సతీష్ కెమెరా వర్క్ చాలా ప్లస్ అయింది. ఆర్టిసులు, టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా కోపరేట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి, కిషోర్ గారికి నా థ్యాంక్స్.." అన్నారు.

Advertisement
Advertisement
Advertisement