Sep 17 2021 @ 00:38AM

సత్యభామతో బంగార్రాజు

‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా తయారవుతున్న ‘బంగార్రాజు’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. చిత్రంలోని ముఖ్య తారాగణం ఈ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇందులో టైటిల్‌ పాత్రను నాగార్జున పోషిస్తున్నారు. ఆయన భార్య సత్యభామగా రమ్మకృష్ణ నటిస్తున్నారు. బుధవారం ఆమె పుట్టిన రోజు కావడంతో విడుదల చేసిన సత్యభామ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నాగచైతన్య, కృతీ శెట్టి మరో జంటగా నటిస్తున్నారు. కుటుంబ సభ్యులందరితో కలసి చూసేలా ‘బంగార్రాజు’ను పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నట్లు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలసి జీ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.