‘బంగార్రాజు’ ప్రేమ గీతం వచ్చేసింది!

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణకృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సెకెండ్‌ సింగిల్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘నా కోసం’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ప్రేయసి కోసం ప్రియుడు తనని తాను ఎలా మార్చుకున్నాడో ఈ పాట చెబుతోంది. నాగ చైతన్య, కృతి శెట్టి, మధ్య మంచి కెమిస్ర్టీ ఉంది. పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి కనిపించి అలరించారు. అనూప్‌ రూబెన్స్‌ ట్యూన్‌కు సిద్‌ శ్రీరామ్‌  మధురమైన గానాన్ని అందించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై.లి., జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.Advertisement