Bangarraju: 'నా కోసం' సాంగ్ టీజర్ రిలీజ్..

అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బంగార్రాజు'. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా 'నా కోసం' అనే సాంగ్ టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 2019లో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా 'నాకోసం మారావా నువ్వూ.. లేక నన్నే మార్చేసావా నువ్వూ..' అంటూ సాగే సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అనూప్ రుబెన్స్ సంగీతం అందించిన దీని పూర్తి లిరికల్ వీడియో సాంగ్ డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 05.12 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.    


Advertisement