Aug 4 2021 @ 01:28AM

బంగార్రాజు... రంభ రెడీ!

వెండితెరపై స్వర్గసీమలోని రంభగా మోనాల్‌ గజ్జర్‌ సందడి చేయనున్నారా? నాగార్జునతో కలిసి ఆడిపాడతారా? అంటే... ‘అవును! ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’ అనే సమాధానం వినపడుతోంది. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటించనున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకుడు. నాగార్జునతో ఆయన తీసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ఈ సినిమా సీక్వెల్‌. మరణించిన బంగార్రాజు స్వర్గసీమకు వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే ఎపిసోడ్‌ ఒకటి ఉందట. అందులో రంభగా మోనాల్‌ గజ్జర్‌ కనిపించనునన్నారని టాక్‌. నాగార్జున, ఆమె మధ్య ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మోనాల్‌ చిత్రంలో నటిస్తున్న విషయం చెప్పే అవకాశం ఉంది. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్యకు జంటగా కృతీ శెట్టిని కథానాయికలుగా ఖరారు చేశారు.