ఉదరం లోపలి చర్మంతో నాలుక... 8 గంటల సర్జరీతో బాధితునికి కొత్త జీవితం!

ABN , First Publish Date - 2021-04-03T15:15:41+05:30 IST

53 ఏళ్ల రాజేష్(పేరు మార్పు) బెంగళూరులో...

ఉదరం లోపలి చర్మంతో నాలుక... 8 గంటల సర్జరీతో బాధితునికి కొత్త జీవితం!

బెంగళూరు: 53 ఏళ్ల రాజేష్(పేరు మార్పు) బెంగళూరులో ఆటో నడుపుతుంటాడు. రెండు నెలల క్రితం అతని నాలుకకు గాయమయ్యింది. చికిత్స కోసం ఎంతమంది వైద్యులను కలసినా ప్రయోజనం లేకపోయింది. అయితే అతని స్నేహిడొకరు... డాక్టర్ సతీష్ సీ దగ్గరకు వెళ్లాలని సలహా ఇచ్చాడు. డాక్టర్ సతీష్ సీ బెంగళూరులోని ట్రస్ట్‌వెల్ ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. రాజేష్ ఆ వైద్యుడిని కలుసుకోగానే సీటీ స్కాన్,  గాయానికి సంబంధించిన బయాప్సీ తీయించాలని చెప్పారు. 


 ఈ పరీక్షల్లో అతని నాలికకు క్యాన్సర్ సోకిందని తేలింది. దీంతో డాక్టర్ సతీష్ అతని నాలుకలో క్యాన్సర్ ఏర్పడిన భాగాన్ని తొలగించారు. తరువాత అతని కడుపులోని స్కిన్ తీసుకుని, కొత్త నాలిక తయారు చేసి, నోటిలో అతికించారు. ఈ చికిత్స కోసం వైద్యులకు 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. ఈ విధంగా ఆహారం తీసుకునేందుకు అనువుగా అతని నోరు సిద్ధమయ్యింది. వైద్యులు చేసిన ఈ ప్రయోగం మరింత మంది బాధితులకు ఆశలు నింపేదిగావుంది. 

Updated Date - 2021-04-03T15:15:41+05:30 IST