CM KCR ఆ విషయం గుర్తుంచుకో.. : బండి సంజయ్..

ABN , First Publish Date - 2021-12-18T18:58:27+05:30 IST

శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..

CM KCR ఆ విషయం గుర్తుంచుకో.. : బండి సంజయ్..

హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతల సమస్యలను  ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బెంగాల్, తమిళనాడు సహా..‌ పక్క రాష్ట్రాలకు కేసీఆర్ గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ లేని సమస్యను సృష్టిస్తున్నారన్నారు. ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ రాజ్యసభ సాక్షిగా చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.


పార్లమెంట్‌లో ఆందోళన చేసిన టీఆర్ఎస్ ఎంపీలు తోకముడిచారెందుకు? అని ప్రశ్నించారు. బెంగాల్లో నాలుగు స్థానాల నుంచి 77సీట్లు సాధించినట్లే.. తెలంగాణలో టీఆర్ఎస్‌పై కొట్లాడుతామని చెప్పారు. టీఆర్ఎస్‌కు చావు డప్పులు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు డిమాండ్‌‌తో ఈనెల 27న ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు దీక్ష చేస్తామన్నారు. నిరుద్యోగులతో పాటు దీక్షలో పాల్గొంటానని చెప్పారు. ఉద్యోగ సంఘలా నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలి? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నియమించిన బిస్వాల్ కమిటీ తెలంగాణలో లక్ష 92వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేల్చిందని బండి సంజయ్ తెలిపారు. 

Updated Date - 2021-12-18T18:58:27+05:30 IST