Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 05 Sep 2021 13:31:37 IST

Bandla Ganesh: ప్రకాష్ రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్

twitter-iconwatsapp-iconfb-icon
Bandla Ganesh: ప్రకాష్ రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ‘సినిమా బిడ్డలు’ ప్యానల్ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకిచ్చారు. ప్రకాష్ రాజ్ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించలేనంటూ చేతులెత్తేశారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ‘‘గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ గారు, నన్ను అధికార ప్రతినిధిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. అయితే నా వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవిని నేను నిర్వర్తించలేను. దానికి న్యాయం చేయలేను. దయచేసి ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంచుకోగలరు. మీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. మీ బండ్ల గణేష్’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.


అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 2న ప్రకాశ్‌రాజ్‌ తన ‘సినిమా బిడ్డల’ ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే తన ప్యానల్‌లో ఉన్న వాళ్లందరితో మీడియా సమావేశం నిర్వహిస్తామని, అప్పుడే ‘మా’ ఎన్నికల కోసం అజెండా, ప్రణాళికను వివరంగా ప్రకటిస్తామని చెప్పారు. అప్పటిదాకా మీడియాతో తమ ప్యానల్‌ తరపున ప్రతినిధులుగా జయసుధ, బండ్ల గణేశ్‌, సాయికుమార్‌ మాత్రమే మాట్లాడతారని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్‌లో ఎక్కడా బండ్ల గణేష్ పేరు లేదు. కనీసం ఈసీ మెంబర్స్ లిస్ట్‌లో కూడా బండ్ల గణేష్ పేరు కనిపించలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రకాష్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు అప్పట్లో మీడియా ముందు ప్రకటన చేసిన సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చినవారిలో బండ్ల గణేష్ ముందున్నారు. ప్రకాష్ రాజ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుంటే సర్దిచెప్పింది కూడా బండ్ల గణేషే. అలాంటి తన పేరు ప్యానల్‌లో లేకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. అందుకే అధికార ప్రతినిధిగా ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు బండ్ల గణేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని అంటున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International