ఈ నెల పాత జీతాలు కావాలి: బండి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-01-25T01:34:15+05:30 IST

ఈ నెల పాత జీతాలు కావాలి.. కొత్త జీతాలు వద్దని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఈ నెల పాత జీతాలు కావాలి: బండి శ్రీనివాసరావు

అమరావతి: ఈ నెల పాత జీతాలు కావాలి.. కొత్త జీతాలు వద్దని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 12 సార్లు చర్చలకు వచ్చినా...తమకు న్యాయం జరగలేదని గుర్తుచేశారు. తమకు జరిగిన గాయాలకు కమిటీ కారం పూస్తుందా? అని బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. 


సెక్రటేరియట్ ఉద్యోగులు ఎప్పుడూ బయటివారితో ఉద్యమం చేయలేదని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న విషయాల్లో కూడా ప్రభుత్వం పంతానికి పోతుందని విమర్శించారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయటపెట్టి చర్చలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-25T01:34:15+05:30 IST