ఇలాంటి పీఆర్సీని నా సర్వీస్‌లో చూడలేదు: బండి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-01-18T16:28:55+05:30 IST

ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్‌లో ఇంతవరకు చూడలేదని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు.

ఇలాంటి పీఆర్సీని నా సర్వీస్‌లో చూడలేదు: బండి శ్రీనివాసరావు

విజయవాడ: ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్‌లో ఇంతవరకు చూడలేదని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కుడిచేత్తో ఇచ్చి ఎడం చేత్తో వసూలు చేస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లు రూ. 40 వేలు హెచ్‌ఆర్‌ఏ తీసుకొని.. తమకు తగ్గించాలని రిపోర్ట్ ఇస్తారా? అంటూ మండిపడ్డారు. తమకు ఈ పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీ, డిఏలను  కొనసాగించాలని బండి శ్రీనివాసరావు అన్నారు.


ఉద్యోగుల భయాందోళనలే నిజమయ్యాయి. జగన్‌ ప్రభుత్వ ‘రివర్స్‌ పీఆర్సీ’ ఖరారైపోయింది. ఇక... ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ సిబ్బంది పెన్షన్లు భారీగా తగ్గనున్నాయి. వేతన సవరణకు సంబంధించిన జీవోలు సోమవారం రాత్రి పొద్దుపోయాక విడుదలయ్యాయి. ఇప్పటికే  ఐఆర్‌  27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ (23.29 శాతం) ప్రకటించిన సర్కారు... ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏల్లోనూ ఉద్యోగులకు ఝలక్‌ ఇచ్చింది. క్వాంటమ్‌ పెన్షన్లలోనూ ఒక శ్లాబు ఎత్తేసింది.  దీంతో పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు ‘రివర్స్‌’ గేరు వేశాయి. 

Updated Date - 2022-01-18T16:28:55+05:30 IST