TS News: బండి సంజయ్ యాత్రపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2022-08-25T17:03:35+05:30 IST

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది.

TS News: బండి సంజయ్ యాత్రపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangram Yatra) పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు (High Court) విచారణ చేయనుంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ లలిత కుమారి సెలవు కావడంతో మరో బెంచ్‌కు బదిలీ అయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత న్యాయస్థానం వాదనలు విననుంది. కాగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపుపై బీజేపీ (BJP) హైకోర్టును ఆశ్రయించింది. పాదయాత్ర కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ (Petition) వేసింది. 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, నిలిపివేయాలని సూచిస్తూ వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్‌ నోటీసు జారీ చేశారు. యాత్రలో భాగంగా పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, దీని వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని నోటీసులో పేర్కొన్నారు. యాత్ర నేపథ్యంలో ధర్మదీక్షను చేపట్టనున్నారని, దీనికి ఇతర జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో తీవ్రమైన శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రను వెంటనే నిలిపివేసుకోవాలని లేదంటే చర్యలు తీసుకుంటామని  ఏసీపీ శ్రీనివాస్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. 

Updated Date - 2022-08-25T17:03:35+05:30 IST