సూర్యాపేట: నేడు సూర్యాపేట జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఆత్మకూర్ (ఎస్), జాజిరెడ్డి గూడెం, తిరుమలగిరి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంజయ్ పరిశీలించనున్నారు. అనంతరం సూర్యాపేట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.