Abn logo
Sep 17 2021 @ 23:37PM

కోహెడ మండలం మీదుగా బండి సంజయ్‌ పాదయాత్ర

రూట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న టీం సభ్యులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి

కోహెడ, సెప్టెంబరు 17: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర కోహెడ మండలం మీదుగా రూట్‌మ్యాప్‌  మారినట్లు రూట్‌మ్యాప్‌ టీమ్‌ సభ్యులు భానప్పగారి వెంకట్‌రెడ్డి, హుస్నాబాద్‌ బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చాడ శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పాదయాత్ర రూట్‌మ్యాప్‌ గ్రామాల్లో వారు పర్యటించారు. అక్టోబర్‌ 2న హుజూరాబాద్‌లో ఈ పాదయాత్ర ముగింపు ఉంటుందని వారు వివరించారు. ఇందుకుగానూ మాచారెడ్డి ఎక్స్‌ రోడ్డు నుంచి గంబీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, బెజ్జంకి, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల మీదుగా హుజూరాబాద్‌కు రూట్‌మ్యాప్‌ తయారు చేసినట్టు చెప్పారు.  కోహెడ మండలం రామచంద్రాపూర్‌, వింజపల్లి, కోహెడ, శ్రీరాములపల్లి, నకరకొమ్ముల, చిగురుమామిడి మండలం నవాబుపేట, సుందరగిరి, రేకొండ గ్రామం వరకు పాదయాత్ర రహదారిని పర్యవేక్షించామన్నారు. కోహెడ మండలానికి ఈ నెల 28న రాత్రి  యాత్ర చేరుకుని, 29న కోహెడ మండలంలో కొనసాగనున్నట్టు వారు వివరించారు. ఈ నెల 30 న చిగురుమామిడి మండలంలో పాదయాత్ర ప్రారంభమై అక్టోబర్‌ 2న హుజూరాబాద్‌లో యాత్ర ముగుస్తుందన్నారు. రూట్‌మ్యాప్‌ టీం వెంట మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, నాయకులు తదితరులు ఉన్నారు.