Abn logo
Sep 28 2021 @ 16:23PM

కేసీఆర్‌ను గద్దె దించేదాక భాష మార్చుకోను: బండి సంజయ్

హైదరాబాద్: వరి వేస్తే ఉరి అని చెబుతున్న కేసీఆర్‌కు వరి కొనమని ఎవరు చెప్పారు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజ కొంటమన్న కేసీఆర్.. ఇప్పుడు నేపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. రైతులను భయపెడుతున్న కేసీఆర్.. ఐదుగురు రైతుల మృతికి కారణం కేసీఆర్ అని చెప్పారు. రైతులకు, బియ్యానికి ఏం సంబంధం.. రైతులు అమ్మేది వడ్లన్నారు.  రైతులు ఎవరూ భయపడొద్దు.. పండించిన ప్రతి గింజను కేసీఆర్ చేత కొనిపిస్తాం.. కేంద్రంతో కొనిచ్చే భాద్యత తనదన్నారు. రాష్త్రంలో నకిలీ విత్తనాలు అమ్మేది కేసీఆర్ సన్నిహితులేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చి మిగితావన్ని బంద్ చేశారని చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో నలుగురికి ఇచ్చుకున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతికి దిక్కులేదని, ఉద్యోగులకు జీతాలు లెవన్నారు. ఆనాడు ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈ రోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నా భాషకు గురువు కేసీఆరే.. కేసీఆర్‌ను గద్దె దించేదాక భాష మార్చుకోనని చెప్పారు.


ఇవి కూడా చదవండిImage Caption