Abn logo
Sep 27 2021 @ 19:10PM

దళితున్ని రాష్ట్రపతి చేసిన ప్రభుత్వం బీజేపీ: బండి సంజయ్

హైదరాబాద్: దళితున్ని రాష్ట్రపతి చేసిన ప్రభుత్వం బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల, రాజాకార్ల లాగా యుద్ధానికి వస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక కేటీఆర్‌ను వదిలిపెట్టమన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కనీసం సీఎం చూడడానికి కూడా రాలేదన్నారు. బతుకమ్మ పండుగను కించపరిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బతుకమ్మ అంటే కవిత కాదన్నారు. ఎంఐఎం పార్టీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండిImage Caption