హైదరాబాద్: గిరిజనులకు పోడుభూములపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్(bandi sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)కు లేఖ రాశారు.పోడుభూముల సమస్యలు పరిష్కరించకుండా హరితహారం నిర్వహించడం గిరిజనులను వంచించడమేనని బండి సంజయ్ విమర్శించారు.పోడుభూముల్లో హరితహారం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.హరితహారానికి బీజేపీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ అన్నారు.ఇతర భూముల్లో హరితహారానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.కేంద్ర అటవీ చట్టం ప్రకారం పోడుభూములపై గిరిజనులకు హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి