Abn logo
Sep 26 2021 @ 13:01PM

బీసీ బంధు అమలు చేయాలి: బండి సంజయ్

హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. క్యాబినెట్‌లో ముగ్గురు కాదని.. 8మంది బీసీలకు స్థానం కల్పించాలన్నారు. అర్హులైన  ప్రతి  బీసీ కుంటుంబానికి రూ. 10 లక్షలు ఆర్ధిక  సహాయం  అందించాలన్నారు. జనాభాలో  50 శాతానికిపైగా  ఉన్న బీసీల  సంక్షేమం  కోసం  బీసీ  బంధు  పథకం   ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి  ప్రేమను విడనాడాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో బీసీ సబ్  ప్లాన్  అటకెక్కిందని బండి సంజయ్ విమర్శించారు. బీసీ సబ్  ప్లాన్‌కు చట్ట భద్రత కల్పించాలని, 46 బీసీ కులాలకు నిర్మిస్తామన్న  ఆత్మగౌరవ భవనాల అడ్రస్ ఎక్కడని ప్రశ్నించారు. రూ. 3,400 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను  వెంటనే  విడుదల  చెయ్యాలన్నారు. చేనేత  కార్మికులకు  భీమా, హెల్త్  కార్డులు  మంజూరు చేయాలని, గీత  కార్మికులను ఆడుకోవడంతో పాటు.. రజకుల‌ కోసం దోబీ ఘాట్‌లను నిర్మించాలన్నారు. బ్రాహ్మణులకు 2వందల యూనిట్ల  కరెంటును  ఉచితంగా ఇవ్వాలని, ఎంబీసీ  కార్పొరేషన్‌కు సమృద్ధిగా నిధులు  కేటాయించాలని బండి  సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...