Abn logo
Sep 19 2021 @ 18:23PM

రాష్ట్ర సంపద రాత్రికి రాత్రే పెరిగిందా..?: సంజయ్

కామారెడ్డి: రాష్ట్ర సంపద రాత్రికి రాత్రే పెరిగిందా..? జీడీపీ పెరిగితే నిరుద్యోగ సమస్య ఎందుకు ఉందని సీఎం కేసీఆర్‌ను  బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో సంజయ్‌ మాట్లాడారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా నిర్మల్‌ సభలో ప్రసంగించి వెళ్లాక సీఎం కేసీఆర్‌ మార్క్‌ రాజకీయం మొదలు పెట్టారని విమర్శించారు. అమిత్‌షా వచ్చి వెళ్లాక ఇంటలిజెన్స్‌ ఆఫీసర్లను సీఎం కేసీఆర్‌ పిలిపించుకొని సభ వివరాలను తెలుసుకున్నారని అన్నారు. ఇంటలిజెన్స్‌ రిపోర్టు బీజేపీకి పాజిటివ్‌గా రావడంతో కేసీఆర్‌ తన సొంత పత్రికల్లో రాష్ట్ర జీడీపీ పెరిగిందంటూ రాయించుకున్నారని సంజయ్‌ విమర్శించారు. తెలంగాణ బిడ్డలకు కేసీఆర్‌ సీఎంగా ఉన్నన్ని రోజులు ఉద్యోగాలు రావన్నారు. త్వరలోనే కేసీఆర్‌ కుటుంబం నుంచి ఇంకొకరికి ఉద్యోగం రాబోతోందని సంజయ్ తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption