Bandi Sanjay‌ హౌస్ అరెస్టు

ABN , First Publish Date - 2022-06-10T16:57:17+05:30 IST

బండి సంజయ్ (Bandi Sanjay‌) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Bandi Sanjay‌ హౌస్ అరెస్టు

Hyderabad: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay‌) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జేబీఎస్ పేరుతో డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తారన్న అనుమానంతో సంజయ్‌ను‌ హౌస్ అరెస్టు చేశారు. అర్థరాత్రి బీజేపీ నేత జిట్టా బాలకృష్టారెడ్డి (Balakrishna Reddy)ని ఘట్ కేసర్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 2న‌ అమరుల యాదిలో  ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌పై స్కిట్ చేసి అగౌరవపరిచారంటూ జిట్టాపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జిట్టాను అరెస్టు చేయటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్తారన్న అనుమానంతో ముందస్తుగా ఆయనను హౌస్ అరెస్టు చేశారు. అయితే జూబ్లీ బస్టాండుకే వెళ్తామని, డీజీపీ ఆఫీస్‌కు వెళ్ళమని.. అనుమతివ్వమని బండి సంజయ్ కోరినా.. పోలీసులు అనుమతించలేదు. అంతేకాకుండా ఆధికారుల ఆదేశం పేరుతో సంజయ్ ఇంటికి 200 మీటర్ల‌ దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేసి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు.

Updated Date - 2022-06-10T16:57:17+05:30 IST