సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

ABN , First Publish Date - 2022-02-05T20:50:14+05:30 IST

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఝానం ఏమైపోయింది, ఇదేనా మీ సంస్కారం అని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు.  ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందన్నారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమవుతారా అని ఆయన మండిపడ్డారు. కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గన్పించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారని ఆయన పేర్కొన్నారు.  


 తొలుత సీఎం కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటన ఆద్యంతం.. వెంటే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్‌ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేకపోయారు. మోదీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పఠాన్‌చేరులోని ఇక్రిశాట్‌కు‌ హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ ఇక్రిశాట్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించనున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ముచ్చింతాల్‌లో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Updated Date - 2022-02-05T20:50:14+05:30 IST