Abn logo
Sep 28 2021 @ 11:55AM

కేసీఆర్ జమానా-అవినీతి ఖజానా..అని సకల జనులు ఘోషిస్తున్నారు?: బండి సంజయ్‌

సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. ఆ లేఖలో పది ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ జమానా-అవినీతి ఖజానా..అని సకల జనులు ఘోషిస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్‌.. అవినీతి భవన్‌గా మారిందన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు సీఎం కేసీఆర్ అనే పేరుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తన నిజాయితీ నిరూపించుకుంటారా? అన్నారు. కేసీఆర్ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?.. దీనిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ప్రజా ధనాన్ని కొల్లగొట్టారా? లేదా? అన్నది స్పష్టం చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption