మానవహక్కుల కమిషన్‌కు Bandi Sanjay ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-26T16:12:30+05:30 IST

Hyderabad: రాష్ట్రంలో రేషన్‌కార్డులను రద్దు చేయడం, కొత్తరేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

మానవహక్కుల కమిషన్‌కు Bandi Sanjay ఫిర్యాదు

Hyderabad: రాష్ట్రంలో రేషన్‌కార్డులను రద్దు చేయడం, కొత్తరేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. రద్దు చేసిన 19 లక్షల రేషన్‌కార్డులపై, కొత్తరేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు జరపాలని కమిషన్‌ను కోరారు. అర్హులైన పేదలకు కొత్తరేషన్‌కార్డులను మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం‌పై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 19 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసిందని బండి సంజయ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్తరేషన్‌కార్డుల‌కు సంబంధించి రాష్ట్రంలో  ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, జూన్‌ 2021 నుంచి కొత్తరేషన్‌కార్డుల దరఖాస్తులను మీ సేవ సెంటర్లు ఆమోదించడం లేదన్న బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-06-26T16:12:30+05:30 IST