సింగరేణిలో ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-06-03T17:29:45+05:30 IST

హైదరాబాద్: సింగరేణి ప్రమాదం విషయంలో కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు.

సింగరేణిలో ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారు: బండి సంజయ్

హైదరాబాద్: సింగరేణి ప్రమాదం విషయంలో కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గని‌లో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


సింగరేణిలో అధికారులకు అక్షయ పాత్రగా ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు మారిపోయారని విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధలను గాలికి వదిలి వేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణిలో ఓబీ పనుల్లో బినామిలతో అధికార పార్టీ నేతలు కాంట్రాక్టు చేయిస్తున్నారని విమర్శించారు. మృతి చెందిన కుటుంబాలకు కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.

Updated Date - 2020-06-03T17:29:45+05:30 IST