హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana) సమాజానికి ప్రధానమంత్రి సమాధానం చెప్పారని, సీఎం కేసీఆర్ (KCR)కు చెప్పాల్సిన అవసరం తమకు లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముందు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రజల వద్ద మొహం చెల్లక సీఎం కేసీఆర్ పారిపోతున్నారని విమర్శించారు. మోదీని ఎదుర్కోవడానికి ఫ్లెక్సీల కోసం ఖర్చుపెట్టిన డబ్బులు పెద ప్రజల కోసం ఖర్చు పెట్టాలన్నారు.
నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. కేసీఆర్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతమయిందన్నారు. ముఖ్యమంత్రి తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ అని, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని బండి సంజయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి