హైదరాబాద్: ఖమ్మం నిరుద్యోగి నవీన్ ఆత్మహత్యపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవీన్ సోదరుడితో బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడారు. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నవీన్ కుటుంబానికి అండగా ఉండాలని బీజేపీ శ్రేణులకు సంజయ్ ఆదేశించారు. నవీన్ ఆత్మహత్య తన గుండెను కలిచివేసిందననారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం కలిసి పోరాడుదామన్నారు.
ఇవి కూడా చదవండి