హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నేతాజీ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎంతోమంది యువత రక్తం చిందించారని, ఆ అమరుల నెత్తుటి మడుగుల్లో నియంతలు, నికృష్టులు రాజ్యమేలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. నేతాజీ జయంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్, పార్టీ నాయకులు బోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.