Abn logo
Feb 26 2021 @ 02:54AM

రాష్ట్రంలో రాక్షస పాలన!

ప్రశ్నించే వారిని జైళ్లలో పెడుతున్నారు : సంజయ్‌ 

కేసీఆర్‌ నా ఎడమకాలి చెప్పుతో సమానం : అర్వింద్‌ 


కామారెడ్డి, మేడ్చల్‌, నల్లగొండ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, రామరాజ్యం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్‌ నేత మల్యాద్రిరెడ్డి, అతని అనుచరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రతీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ చెప్పిందే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కొంతమంది బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తన ఎడమకాలి గోటితో, చెప్పుతో సమానమని అన్నారు. ఆయనకు పాలతో అభిషేకం కాదు.. కల్లుతో చేయాలని వ్యాఖ్యానించారు. ‘‘20 ఏళ్లు దాటిన వాహనాలను స్ర్కాప్‌ కింద ఎలా జమ కడతామో.. అలానే టీఆర్‌ఎస్‌ పార్టీ కారుకు ఇక కాలం చెల్లింది. తుప్పుపట్టిన టీఆర్‌ఎస్‌ కారును ప్రజలు మూలకు పడేయాలనే ఆలోచనలో ఉన్నారు’’ అని బండి సంజయ్‌ మేడ్చల్‌లో అన్నారు.  


టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే : కూన శ్రీశైలం గౌడ్‌

టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయే అని దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ అన్నారు.గురువారం తొలిసారిగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రాగా, బండి సంజయ్‌ ఆయనను సన్మానించారు.  

Advertisement
Advertisement
Advertisement