Abn logo
Sep 26 2021 @ 02:10AM

బీజేపీ విధానాలకు నిరసనగా రేపు బంద్‌

గుడ్లూరులో బైకు ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయుకులు

గుడ్లూరు, సెప్టెంబరు 25 : బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంటెనపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రమైన గుడ్లూరులో శనివారం బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు గంటెనపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధలను వెంటనే తగ్గించాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనికోరారు. విద్యుత్‌ అధిక బిల్లులను తగ్గించి సామాన్యూడికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దామా కృష్ణయ్య, పాలకీర్తి నాగేశ్వరరావు, నేలటూరి తిరుపాలు, కొట్టే వెంకయ్య, పి. భాస్కర్‌, డి. జాన్‌, నక్కా కోటేశ్వరరావు,  పాల్గొన్నారు. భారత్‌ బంద్‌కు టీడీపీ మద్దతు

పామూరు : మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేసి రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని టీడీపీ ఒంగోలు పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లులు ఒక ప్రకటనలో తెలిపారు. 

లింగసముద్రం : ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం నాయకులు జి వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం సాయంత్రం మోటారు సైకిల్‌ ర్యాలీ లింగసముద్రం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల భారతదేశ ప్రజలు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారన్నారు. ఈ విధానాలు వ్యతిరేకించి, బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికే భారత్‌ బంద్‌ అని అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలు తగ్గించాలని, ప్రభుత్వ సంస్థలను కాపాడాలని, డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాధు చెన్న కేశవులు, డి.జాన్‌, సవలం చెన్నయ్య, పి నాగేశ్వరరావు, ఎన్‌ తిరుపాలు, మన్నెం మాల్యాద్రి, నక్కా కోటేశ్వరరావు, జె హజరత్‌లు పాల్గొన్నారు.

కనిగిరి : ఈ నెల 27న చేపట్టే భారత్‌ బంద్‌కు ప్రతి ఒక్కరు మద్దతిచ్చి విజయవంతానికి కృషి చేయాలని రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసులరెడ్డి కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో  ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆద్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మునుపెన్నడు జరగని విధంగా భారత్‌ బంద్‌ జరుగుతుందన్నారు. బంద్‌లో దేశవ్యాప్తంగా ఉన్న రైతు, కార్మిక సంఘాలతో పాటు 19 రాజకీయ పార్టీలు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. బంద్‌ను విజయవతం చేయాలన్నారు.