ఉక్కుపై 5న బంద్‌

ABN , First Publish Date - 2021-02-28T08:24:10+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మార్చి 5న బంద్‌కు ఇచ్చిన పిలుపును బలపరుస్తున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి. బంద్‌ను జయప్రదం చేయాలని అన్ని తరగతుల ప్రజానీకాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నాడు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న

ఉక్కుపై 5న బంద్‌

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు

మద్దతు తెలిపిన టీడీపీ, వామపక్షాలు

త్యాగాలు వృథా కానీయం: ఏపీఎన్జీవో  


(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌)

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌  ప్రయివేటీకరణ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మార్చి 5న  బంద్‌కు ఇచ్చిన పిలుపును బలపరుస్తున్నట్లు వామపక్ష పార్టీలు తెలిపాయి. బంద్‌ను జయప్రదం చేయాలని అన్ని తరగతుల ప్రజానీకాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నాడు 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌కు అమ్మడానికి పూనుకోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు విషయంలో మోసం చేసిన బీజేపీ.. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణతో ప్రజలకు మరోసారి ద్రోహం చేస్తోందని ఆక్షేపించారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే మార్గమన్నారు. 


కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మార్చి 5న బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చిందని తెలిపారు. కాగా, మార్చి 5న బంద్‌కు అన్నివర్గాల మద్దతు కూడగట్టే పనిలో ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నిమగ్నమైంది. శనివారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. ప్రజా ప్రతినిధులను కలిసిన వారిలో కమిటీ చైర్మన్లు సీహెచ్‌ నరసింగరావు, మంత్రి రాజశేఖర్‌, కో-కన్వీనర్లు కేఎ్‌సఎన్‌ రావు, గంధం వెంకటరావు ఉన్నారు.


బంద్‌ను జయప్రదం చేయండి: మధు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంద్‌కు కార్మిక, ప్రజాసంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని, పోలవరం నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని, పెట్రోల్‌, డీజిల్‌ ధర పెరుగుదల ప్రభావం నిత్యావసరాలపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  


బంద్‌కు ఏపీఎన్జీవో సంపూర్ణ మద్దతు

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. పరిశ్రమ ఏర్పాటు కోసం నాడు ప్రాణాలు కోల్పోయిన 32 మంది త్యాగాలను వృథా కానివ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. శనివారం అనంతపురంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 వేల మందికిపైగా ఉద్యోగులను రోడ్డున పడేయాలని చూస్తే సమైక్యాంధ్ర తరహాలో మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మార్చి 5న చేపట్టనున్న బంద్‌కు ఏపీఎన్జీవో సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. అలాగే, కరోనా కారణంగా ఫ్రీజ్‌ చేసిన మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌, 55 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. 


ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కారెం జలదీక్ష

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి-ముక్తేశ్వరం గోదావరిలో శనివారం జలదీక్ష చేశారు. ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఢిల్లీలో ఉద్యమం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2021-02-28T08:24:10+05:30 IST