ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టు... ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు!

ABN , First Publish Date - 2021-08-29T16:03:46+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బాందాకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి...

ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టు... ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు!

బాందా: ఉత్తరప్రదేశ్‌లోని బాందాకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి... సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు అతనికి సమస్యలు తెచ్చిపెట్టింది. ఆ వ్యక్తి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్‌లోని చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పీడబ్ల్యుడీ ఆఫీసులో పనిచేస్తున్న నిజాముద్దీన్ సిద్ధిఖీ ఫేస్‌బుక్‌లో సీఎంపై అభ్యంతరకర పోస్టు పెట్టారు. ఇది వైరల్ అయిన నేపధ్యంలో పోలీసులు నిజాముద్దీన్ సిద్ధిఖీ ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-08-29T16:03:46+05:30 IST