హోరాహోరీగా బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2021-04-22T05:41:51+05:30 IST

మండలంలోని బోయలకుంట్ల గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా న్యూ కేటగిరీ విభాగంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి.

హోరాహోరీగా బండలాగుడు పోటీలు
బండలాగుడు పోటీల్లో పాల్గొన్న ఎద్దులు

శిరివెళ్ల, ఏప్రిల్‌ 21 : మండలంలోని బోయలకుంట్ల గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా న్యూ కేటగిరీ విభాగంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి పోటీలను ప్రారంభించి రైతులకు జ్ఙాపికలు అందించారు. పెద్దకొట్టాలకు చెందిన కేశవరెడ్డి ఎద్దులకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, శిరివెళ్ల మండలం గుంప్రమాన్‌దిన్నెకు చెందిన కుందూరు రాంభూపాల్‌రెడ్డి ఎద్దులకు రెండో బహుమతిగా రూ.40 వేలు, బిల్లలాపురానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి ఎద్దులకు మూడో బహుమతిగా రూ.30 వేలు, దువ్వూరు మండలం రామాపురానికి చెందిన శ్రీనివాసులు నాయుడు ఎద్దులకు నాల్గో బహుమతిగా రూ.20 వేలు, గుంప్రమాన్‌దిన్నెకు చెందిన కుందూరు రాంభూపాల్‌రెడ్డి ఎద్దులకు ఐదో బహుమతిగా రూ.10 వేలు, శిరివెళ్ల మండలంలోని బోయలకుంట్లకు చెందిన బాలకృష్ణ ఎద్దులకు ఆరో బహుమతిగా రూ.5 వేలు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 


రుద్రవరం: మండలంలోని ఆలమూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన బండలాగుడు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ఈ బండలాగుడు పోటీలకు 10 జతల ఎద్దులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలైన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాల్గొ బహుమతి రూ.5 వేలు ప్రదానం చేశారు. 


గడివేముల: మండలంలోని గడిగరేవుల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ఆరు, ఆరుపండ్లలోపు వృషభాల బలప్రదర్శన హోరాహోరిగా సాగింది. ఈ పోటీలను తిరుపంరెడ్డి ప్రారంభించగా మాజీ మంత్రి ఏరాసు ప్రతా్‌పరెడ్డి వృషభాల యజమానులను సన్మానించారు. ఈ పోటీల్లో రోళ్లపాడు గ్రామానికి చెందిన పేరెడ్డి రామ్మోహన్‌రెడ్డి వృషభాలు మొదటి బహుమతి, ఊడుమాల్పురం గ్రామానికి చెందిన ఈశ్వరసాకేత్‌రెడ్డి వృషభాలు రెండోస్థానంలో, కె.బొల్లవరం గ్రామానికి చెందిన తలారి వెంకటేశ్వర్లు మూడో స్థానం, చెలిమెల్ల గ్రామానికి చెందిన అవినాష్‌ వృషభాలు నాల్గొ స్థానంలో, కె.బొల్లవరం గ్రామానికి చెందిన చిన్న వెంకటరమణయాదవ్‌ వృషభాలు ఐదో స్థానంలో నిలిచాయి. గెలుపొందిన వృషభాల యజమానులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. 


బండలాగుడు పోటీల్లో గుంటూరు ఎడ్లకు ప్రథమ స్థానం

 ఓర్వకల్లు: నన్నూరు గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి పాలపండ్ల బండలాగుడు పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 9 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన ఎద్దుల యజమానులకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకుడు ప్రభాకర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ చెన్నారెడ్డి నగదును అందజేశారు. ఈ పోటీల్లో మొదటి విజేతగా గుంటూరు జిల్లా ఆర్‌కే బుల్స్‌ వేటపాలెం గ్రామానికి చెందిన ఎద్దులు 4,500 అడుగుల దూరం లాగి రూ.50 వేల నగదును గెలుచుకున్నాయి. రెండో స్థానంలో గుంటూరు జిల్లా వేటపాలెం ఆర్‌కే బుల్స్‌ ఎద్దులు 4,200 అడుగుల దూరం లాగి రూ.40 వేల నగదును గెలుచుకున్నాయి. మూడో స్థానంలో కర్నూలు జిల్లా వడ్డెమాను  గ్రామానికి చెందిన రైతు రామానాయుడు ఎద్దులు 3,900 అడుగుల దూరం లాగి రూ.30 వేల నగదును గెలుచుకున్నాయి.. నాలుగో స్థానంలో కర్నూలు జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన దుబ్బన్న ఎద్దులు 3783 అడుగుల దూరం లాగి రూ.20 వేల నగదును గెలుచుకున్నాయి. 5వ విజేతగా కర్నూలు జిల్లా తడకనపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఎద్దులు 3689 అడుగుల దూరం లాగి రూ.10వేల నగదును గెలుచుకున్నాయి. 6వ విజేతగా అనంతపురం జిల్లా గుత్తి టౌన్‌ గ్రామానికి చెందిన రామాంజినేయులు ఎద్దులు 3,600 అడుగుల దూరం లాగి రూ.5 వేల నగదును గెలుచుకున్నాయి. 

Updated Date - 2021-04-22T05:41:51+05:30 IST