చర్మసౌందర్యానికి అరటి!
ABN , First Publish Date - 2021-03-28T05:46:31+05:30 IST
అరటిపండులో పోషకాలు పుష్కలం. అంతేకాదుఅరటిపండు చర్మసౌందర్యానికి కూడా పనికొస్తుంది. బనానా ఫేస్‌మాస్క్‌లతో చర్మ సౌందర్యం రెట్టింపవుతుంది
అరటిపండులో పోషకాలు పుష్కలం. అంతేకాదు అరటిపండు చర్మసౌందర్యానికి కూడా పనికొస్తుంది. బనానా ఫేస్‌మాస్క్‌లతో చర్మ సౌందర్యం రెట్టింపవుతుంది.
మొటిమల నివారణకు: రెండు టేబుల్‌స్పూన్ల అరటిపండు గుజ్జు, ఒక టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడా, అరటేబుల్ స్పూను తాజానిమ్మరసం మూడింటిని గిన్నెలో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే యాక్నే సమస్య తలెత్తదు.
ముడతలు పోవాలంటే: రెండు టేబుల్‌స్పూన్ల అరటిపండు గుజ్జు, ఒక టేబుల్‌స్పూను పెరుగు, అరటేబుల్‌స్పూను తాజా నిమ్మరసం కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు నాలుగుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నిగారింపుకోసం..!: రెండు టేబుల్‌స్పూన్ల అరటిపండు గుజ్జు, ఒక టేబుల్ స్పూను తేనె రెండూ కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.