Abn logo

బనానా రైతా

కావలసినవి : అరటికాయ - ఒకటి, పెరుగు - పావుకేజీ, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత.


తయారీ : కుక్కర్‌లో అరటికాయలు వేసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి.

ఒక పాత్రలో పెరుగు తీసుకుని గట్టిగా లేకుండా గిలక్కొట్టాలి.

ఇప్పుడు అందులో అరటికాయ గుజ్జు, జీలకర్రపొడి, ఉప్పు వేసి కలపాలి.

ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి వేగించాలి.

ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. 

ఈ పోపుని రైతాపై పోయాలి.

వెజిటబుల్‌ బిర్యానీలో ఈ రైతా వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

మ్యాంగో రైతాబీరకాయ రైతాఆలూ రైతారాడిష్‌ రైతాద్రాక్ష రైతాశివరాత్రి రైతాపాలకూర రైతారైతామ్యాంగో రైతాకీరా రైతా
Advertisement
d_article_rhs_ad_1
Advertisement