లాక్ డౌన్ వెతలు: ఆనంద్ మహీంద్రా చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2020-04-10T02:08:48+05:30 IST

అరటి రైతుల్ని ఆదుకున్న ఆనంద్ మహీంద్రా! నెటిజన్లు ఫిదా

లాక్ డౌన్ వెతలు: ఆనంద్ మహీంద్రా చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా!

న్యూఢిల్లీ: లాక్‌‌ డౌన్ కారణంగా అనేక వ్యాపారాలు మూతపడుతున్నాయి. తమ ఉత్పత్తులను అమ్ముకోలేక కొంత మంది రైతులు కూడా బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని పద్మా రామ్‌నాథ్ అనే రిటైర్డ్ విలేకరి.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా అరటి తోటల రైతులు అరటి ఆకుల్ని అమ్ముకోలేక అవస్థపడుతున్నారని తెలిపారు. మహీంద్రా సంస్థల క్యాంటీన్లలో ప్లాస్టిక్ ప్లేట్ల బదులు అరటి ఆకులను వాడితే రైతుల ఇబ్బందులు తీరుతాయని సూచించారు.


దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆనంద్ మహీంద్రా వెంటనే ఈ విషయాన్ని తన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత అందరూ కలిసి కంపెనీల క్యాంటీన్లలో ప్లాస్టిక్ ప్లేట్ల బదులు అరటి ఆకులను వినియోగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాలన్నిటీనీ ఆనంద్ మహీంద్రా స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అకస్మాత్తుగా తనకు ఆ జర్నలిస్టు నుంచి మెయిల్ వచ్చిందని మహీంద్రా తెలిపారు. కాగా.. రైతుల కోసం ఆయన చేస్తున్న సహాయంపై నెటిజన్లు హర్షం వక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2020-04-10T02:08:48+05:30 IST