అరటి రైతుకు అగచాట్లు

ABN , First Publish Date - 2020-04-04T11:26:49+05:30 IST

అరటి రైతుకు కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించినప్పటికీ, కరోనా ప్రభంజనంతో కొనే వారులేక రైతులు అల్లాడుతున్నారు.

అరటి రైతుకు అగచాట్లు

కొనుగోలుకు నోచుకోని పంట


త్రిపురాంతకం, ఏప్రిల్‌ 3 : అరటి రైతుకు కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం  కష్టపడి పండించినప్పటికీ, కరోనా ప్రభంజనంతో కొనే వారులేక రైతులు అల్లాడుతున్నారు.  సోమేపల్లికి చెందిన ఆశ ఏడుకొండలు తన రెండెకరాల పొలంలో అరటి  సాగు చేశారు.  అందుకోసం రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు.  అరటి గెలలు  ఏపుగా పెరిగాయి. పంట అమ్మితే పెట్టుబడి చేతికి అందుతుందని ఆశించిన ప్పటికీ ఆయనకు నిరాశే ఎదురవుతుంది. కరోనా ప్రభావంతో ఆయనకు కష్టాలు ఎదురయ్యాయి. లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో  కొనేవారు ఎవరూ ముందు కు రాకపోవడంతో రైతులు పొలంలోనే కాపును వదిలేశాడు. గెలలు  తోటోనే మగ్గిపోతున్నామని ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-04T11:26:49+05:30 IST