Abn logo
Jan 27 2021 @ 00:51AM

‘వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి’


ఆదోని, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని రైతు సంఘాల నాయకులు అన్నారు.  ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి సంఘీభావంగా మంగళవారం  రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదోనిలో  ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు.   రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకుడు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నల నడ్డీ విరిచే విధంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రోజుల తరబడి ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మల్లికార్జున, కల్లుబావి రాజు, బసాపురం గోపాల్‌ పాల్గొన్నారు. 


కోసిగి: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాలు  ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు రాముడు, జిలాని, గోపాల్‌, జయరాజ్‌ అన్నారు. మంగళవారం కోసిగిలో నిరసన తెలిపారు. వీరేష్‌, పూజారి శ్రీనివాసులు, పరుశురాం, సిద్దప్ప, అనిల్‌, రామాంజి, హనుమంతు,  ఎల్లప్ప, ఉపేంద్ర వీరేష్‌ తదితరులు ఉన్నారు. 


పెద్దకడుబూరు: వ్యవసాయ రంగాన్ని, బీజేపి ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడతున్నారని సీపీఎం, ఏఐకేఎస్‌, రైతు సంఘ నాయకులు తిక్కన్న, పరమేష్‌, వీరేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగ ళవారం పెద్దకడబూరులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆంజినేయలు, హనుమంతు, రామాంజినేయులు, గిడ్డయ్య పాల్గొన్నారు

 

Advertisement
Advertisement
Advertisement