Zakir Naik ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు

ABN , First Publish Date - 2021-11-16T13:38:25+05:30 IST

ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ నేతృత్వంలోని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)పై విధించిన నిషేధాన్ని కేంద్రం మరో ఐదేళ్లపాటు పొడిగించింది....

Zakir Naik ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ నేతృత్వంలోని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)పై విధించిన నిషేధాన్ని కేంద్రం మరో ఐదేళ్లపాటు పొడిగించింది.ప్రస్థతం మలేషియాలో ఆశ్రయం పొందిన జకీర్ నాయక్ ఐఆర్‌ఎఫ్ దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.శాంతి,మత సామరస్యానికి భంగం కలిగించే ఈ ఫౌండేషన్ పై  2016వ సంవత్సరం నవంబర్ 17న కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 (37 ఆఫ్ 1967) ప్రకారం చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది.జకీర్ నాయక్ చేసిన ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరమైనవని, వీటి ద్వారా అతను మత సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాడని కేంద్రం పేర్కొంది. 


అంతర్జాతీయ శాటిలైట్ టీవీ నెట్‌వర్క్, ఇంటర్నెట్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు చేరేలా జకీర్ నాయక్ మత ప్రచారం చేస్తున్నారు.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూఏపీఏ కింద ఐఆర్‌ఎఫ్‌పై విధించిన నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.


Updated Date - 2021-11-16T13:38:25+05:30 IST