క్రికెట్‌లో ఆ రూల్ పెట్టడం కష్టం: బ్రెట్‌లీ

ABN , First Publish Date - 2020-05-24T00:07:39+05:30 IST

రోనా కారణంగా ప్రపంచమే మారుతోంది. క్రికెట్‌లో కూడా పలు సంభవించేలా కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి ఉమ్మి, చెమటలతో...

క్రికెట్‌లో ఆ రూల్ పెట్టడం కష్టం: బ్రెట్‌లీ

కాన్‌బెర్రా: కరోనా కారణంగా ప్రపంచమే మారుతోంది. క్రికెట్‌లో కూడా పలు మార్పులు సంభవించేలా కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి ఉమ్మి, చెమటలతో బంతిని తుడవకుండా ఉండే రూల్. ఇప్పటికే ఈ రూల్ అమలుకు సంబంధించి క్రికెట్ బోర్డులు సంప్రదింపులు జరుపుతుండగా.. పలువురు బౌలర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ ఈ నిబంధనపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో క్రికెట్‌కు సంబంధించి ఈ నిబంధన మంచి పరిణామమేనని, అయితే దీనిని అమలు చేయడం చాలా కష్టమని చెప్పాడు. ‘బౌలర్లు తమ జీవితాంతం బంతిని ఉమ్మితో తుడిచి షైన్ చేసేందుకు అలవాటు పడి ఉంటారు. ఒక్కసారిగా అది మారిపోవాలంటే సాధ్యం కాకపోవచ్చు’ అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-24T00:07:39+05:30 IST