డెల్టా వేరియంట్ భయంతో.. భారత విమానాలపై బ్యాన్ పొడిగింపు!

ABN , First Publish Date - 2021-06-16T02:01:46+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు పడుతున్న భారత్ నుంచి వచ్చే విమానాలపై ఫిలిప్పైన్స్ నిషేధాన్ని పొడిగించింది.

డెల్టా వేరియంట్ భయంతో.. భారత విమానాలపై బ్యాన్ పొడిగింపు!

ఫిలిప్పైన్స్: కరోనా సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు పడుతున్న భారత్ నుంచి వచ్చే విమానాలపై ఫిలిప్పైన్స్ నిషేధాన్ని పొడిగించింది.  కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విజృంభించడంతో ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు, విమానాలపై పలు దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా కరోనా వేరియంట్‌ను గ్లోబల్ కన్సర్న్ జాబితాలో ప్రపంచ ఆరోగ్యసంస్థ చేర్చింది. ఈ వేరియంట్ బ్రిటన్‌లో కూడా విజృంభిస్తోంది. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని నిరోధించడం కోసం భారత్‌తోపాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఒమన్, యూఏఈ దేశాల నుంచి వచ్చే విమానాలపై జూన్ 30 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ఫిలిప్పైన్స్ ప్రకటించింది. గడిచిన 14 రోజుల్లో ఈ దేశాలను సందర్శించిన పర్యాటకులను కూడా తమ దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2021-06-16T02:01:46+05:30 IST