చైనీస్ విష రసాయన వ్యతిరేక ఉద్యమానికి భారీ మద్దతు

ABN , First Publish Date - 2021-04-09T21:56:09+05:30 IST

చైనీస్ విష రసాయనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి విపరీంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఉద్యమానికి భారీగా మద్దతు తెలుపుతున్నారు. మామిడికాయలను కృత్రిమంగా..

చైనీస్ విష రసాయన వ్యతిరేక ఉద్యమానికి భారీ మద్దతు

ఇంటర్నెట్ డెస్క్: చైనీస్ విష రసాయనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి విపరీంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఉద్యమానికి భారీగా మద్దతు తెలుపుతున్నారు. మామిడికాయలను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు వాడే ఎథిఫోన్ ఓ విషరసాయనమని, దీనిని వెంటనే దేశ వ్యాప్తంగా నిషేధించాలని నినదిస్తున్నారు. ఈ విషరసాయనం చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతోందని, ఇది వాడిన మామిడి కాయలను తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడతున్నారని, దీనిని వెంటనే దేశంలో నిషేధించాలని ట్విటర్ వేదికగా ఈ రోజు నెటిజన్లు భారీ ఉద్యమం నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో వేల మంది నెటిజన్లు #BanChineseEthephon అనే హ్యాష్ ట్యాగ్‌తో ఏకకాలంలో పెద్ద సంఖ్యలో ట్వీట్లు చేశారు. దీంతో ఈ హ్యాట్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.


ట్విటర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తామంటూ సదరు నెటిజన్లు తమ ట్వీట్ల ద్వారా పేర్కొన్నారు. ఎథిఫోన్ రసాయనంతో మగ్గించిన పళ్ళు ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయని, పెద్దలు-పిల్లలలనే తేడా లేకుండా అందరిపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. 


ఈ క్రమంలోనే ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని, ఎథిపోన్ ప్యాకెట్లను అక్రమంగా అమ్ముతున్న ముఠాలపై దాడి చేసి విక్రయాలను నిరోధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు.

Updated Date - 2021-04-09T21:56:09+05:30 IST