కావలసినవి: చికెన్ - ఒకకిలో, టొమాటోలు - రెండు, వెల్లుల్లి - ఐదు రెబ్బలు, అల్లం - రెండు అంగుళాల ముక్క, పచ్చిమిర్చి - ఎనిమిది, బ్యాంబూ షూట్స్ - అర కప్పు ముక్కలు, క్యాబేజీ తురుము - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ విధానం: ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంచి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత క్యాబేజీ తురుము, బ్యాంబూ షూట్స్ వేసి కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. క్యాబేజీ ఉడికిన తరువాత చికెన్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కలియబెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి చిన్న మంటపై చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొన్ని బ్యూంబూ షూట్స్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.