ఊ.. అంటారా.. ఊహూ.. అంటారా..!

ABN , First Publish Date - 2022-04-20T16:57:15+05:30 IST

మేయర్‌ ఎన్నికల తర్వాత బళ్లారి నగర కాంగ్రె్‌సలో విబేధా లు తార స్థాయికి చేరుకున్నాయి. మేయర్‌ పీఠం పై ఆశ పెట్టుకున్నావాళ్లంతా పదవి దక్కలేదన్న అక్కసుతో

ఊ.. అంటారా.. ఊహూ.. అంటారా..!

- డిమాండ్లు తీర్చాలని కార్పొరేటర్ల ఒత్తిడి

- లేదంటే పార్టీని వీడిపోతామని బెదిరింపు

- నేరుగా నాయకులకే ఫోన్లు

- ఆవేశం వద్దంటున్న నేతలు

- రాజకీయ డ్రామా:  కాంగ్రెస్‌ సీనియర్లు


బళ్లారి(కర్ణాటక): మేయర్‌ ఎన్నికల తర్వాత బళ్లారి నగర కాంగ్రెస్ లో విబేధాలు తార స్థాయికి చేరుకున్నాయి. మేయర్‌ పీఠం పై ఆశ పెట్టుకున్నావాళ్లంతా పదవి దక్కలేదన్న అక్కసుతో అసంతృప్తి జ్వాలలు రగిలి స్తున్నారు. కొందరు కార్పొరేటర్లు పార్టీని వీడతామని బెదిరిస్తుండంతో కాంగ్రెస్‌ నేతలకు పాలు పోవడం లేదు. వీరిలో నలుగురు కార్పొరేటర్లు మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారితో పాటు మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతాం..మీ సంగతేంటి అంటూ బాహాటంగానే ప్రశ్నిస్నున్నారు. కానీ కొందరు కాంగ్రెస్‌ నాయకులు మాత్ర దీన్ని తీసిపడేస్తున్నారు. అదంతా ఒక రాజకీయ డ్రామా ఇప్పుడు పార్టీ వదిలి పోయి ఏమి చేస్తారు. అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మేయర్‌ పదవి ఆశించిన ముల్లంగి నందీష్‌ బాబు కాదని ఆదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుబ్బరాయుడు భార్య రాజేశ్వరికి పదవి కాంగ్రెస్‌ నాయకులు ఇప్పించడం రాజకీయ ఎత్తుగడులకు తెర లేచింది. దీనితో ముల్లంగి రవింద్ర వర్గం పూర్తీగా నిరాశ చెందింది. ముఖ్యంగా గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు గాలిసోమశేఖర్‌రెడ్డి కుమారుడు పై గెలిచిన ముల్లంగి నందీష్ కు మేయర్‌ పదవి వస్తుందని అందురూ అనుకున్నారు. ఈ నేపథ్యం లో బాగంగానే ముల్లంగి భారీగానే డబ్బులు ఖర్చుచేసుకున్నారు. కానీ రిజర్వేషన్ల మార్పుతో వారి ఆశలకు గండి పడింది. అదే సామాజిక వ ర్గంలో ఎమ్మెల్యే నాగేంద్రకు అనుకూలంగా ఉండే వారికి ఇవ్వడం ముల్లంగి వర్గానికి మింగుడు పడడం లేదు. 6వ వార్డు కార్పొరేటర్‌ వివేక్‌ భార్య కాంగ్రెస్‌ పార్టీకి, రాజీనాయా చేసింది. కార్పొరేట్‌ పదవి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఇది ఇలా ఉంటే మరి కొందరు కార్పొరేటర్లు బీజేపీ నాయకులకు టచ్‌లోకి వెల్లా రు. మేయర్‌ను దింపాలి..మేము మీకు మద్దత్తు ఇస్తాము అని కూడా చెప్పినట్లు సమాచారం. కానీ ఏడాది మేయర్‌ పదవి కాలంలో కనీసం సగ భాగం అంటే కనీసం 6 నెలలు పూర్తీ కావాలి అంతలోపు మేయర్‌ పై అవిశ్వాసం పెట్టడం కుదరదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, నారా సూర్యనారాయణరెడ్డి, ముండ్లూరు దివాకర్‌బాబు, ‘బుడా’మాజీ  అధ్యక్షుడు జేఎస్‌ ఆంజనేయులు తదితరులు కార్పొరేటర్లను బు జ్జగిస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయ డ్రామా అని, మేయర్‌ను దింపాలని చూస్తే ఊరుకునేది లేదని మేయర్‌ వర్గీయులు చెప్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్‌ పా ర్టీలో నెలకొన్న రెండు వర్గాల మధ్య పోరులో బీజేపీ లాభపడాలని చూస్తుంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని పార్టీ నేతుల కో రుకుంటున్నారు. లేదంటే పార్టీకి పట్టు ఉన్న జిల్లాలో కీలక నాయకులను కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు.

Updated Date - 2022-04-20T16:57:15+05:30 IST